ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో మాన్సూన్ తీవ్రంగా విరుచుకుపడింది. ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రధాన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముషీరాబాద్‌లో 124 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై అగ్రస్థానంలో నిలిచింది. మెట్టుగూడ, తార్నాక, హబ్సిగూడ, మౌలాలి, కాప్రా ప్రాంతాల్లో కూడా 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
ముషీరాబాద్, మెట్టుగూడ, చిలకలగూడ, ఉస్మానియా యూనివర్సిటీ, తార్నాక, హబ్సిగూడ, మౌలాలి, కాప్రా ప్రాంతాలు భారీ వర్షానికి అతలాకుతలమయ్యాయి.
ముషీరాబాద్‌లోని బౌద్ధనగర్‌లో 12.4 సెంటీమీటర్లు, ఎంసిహెచ్ కాలనీలో 11.9 సెంటీమీటర్లు, ఉస్మానియా యూనివర్సిటీలో 105.8 మిల్లీమీటర్లు, కాప్రాలో 103.3 మిల్లీమీటర్లు, మర్రెడ్‌పల్లి 101.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇక షేక్‌పేట్, జూబ్లీహిల్స్ (99 మి.మీ), ముషీరాబాద్‌లోని ఆదిక్‌మెట్ (96 మి.మీ), అంబేద్కర్‌నగర్ (అల్వాల్) (95.8 మి.మీ), జీడిమెట్ల కుత్బుల్లాపూర్ ESS (95.5 మి.మీ), సీతాఫల్మండి, మర్రెడ్‌పల్లి (91.5 మి.మీ), విద్యానగర్ హిమాయత్‌నగర్‌లోని TSRTC ఎంప్లాయీ బిల్డింగ్ (90.5 మి.మీ), అల్వాల్ కమ్యూనిటీ హాల్ (88.8 మి.మీ), ఉప్పల్ GHMC జోనల్ ఆఫీస్ (88.8 మి.మీ) వంటి చోట్ల కూడా భారీ వర్షపాతం నమోదైంది.”

