గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్‌కు చెందిన యూట్యూబ్ సేవలు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులకు పనిచేయకపోవడంతో పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడింది.
అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా మరియు యుకే సహా పలు దేశాల్లో వీడియో స్ట్రీమింగ్ పూర్తిగా ప్రభావితమైంది అని డౌన్‌డిటెక్టర్ (Downdetector) పేర్కొంది.
బుధవారం యూట్యూబ్ ఈ సమస్యను అంగీకరించింది. తన స్టేటస్ పేజీలో “కొంతమంది వినియోగదారులు వీడియోలు వీక్షించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారని మాకు తెలిసింది, మేము దీనిని పరిశీలిస్తున్నాము” అని తెలిపింది.
అయితే ఈ గ్లోబల్ అవుటేజ్‌కు కారణం ఏమిటో ఇప్పటికీ స్పష్టత రాలేదు.
డౌన్‌డిటెక్టర్ ప్రకారం, అమెరికాలో మాత్రమే సాయంత్రం 7:55 ET (స్థానిక సమయం) నాటికి 3.66 లక్షలకుపైగా వినియోగదారులు యూట్యూబ్ పనిచేయడం లేదని నివేదించారు.
తాజా అప్‌డేట్‌లో డౌన్‌డిటెక్టర్ తన X (మాజీ ట్విట్టర్) ఖాతాలో ఇలా తెలిపింది –
“యూట్యూబ్‌తో కొనసాగుతున్న సమస్యపై ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా రిపోర్టులు నమోదయ్యాయి. ఈ లోపం సాయంత్రం 7:12 ET సమయంలో మొదట గుర్తించబడింది.”

