More

    కనకధారా స్తోత్రం (Kanakadhara Stotram in Telugu )

    Date:

    కనకధారా అంటే “బంగారు ధార” అని అర్థం. ఒకానొక సమయంలో ఆదిశంకరాచార్యుల వారు భిక్షాటన చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్లారు. ఆ పేదరాలు తన వద్ద ఏమీ లేకపోయినా, ఎంతో భక్తితో తన వద్ద ఉన్న ఒకే ఒక ఎండిపోయిన ఉసిరి కాయను శంకరులకు భిక్షగా సమర్పించింది. ఆమె పేదరికానికి చలించిన శంకరులు, ఆమె దారిద్ర్యాన్ని తొలగించమని మహాలక్ష్మీ దేవిని ప్రార్థిస్తూ ఆశువుగా ఈ స్తోత్రాన్ని పఠించారు. దేవి ప్రసన్నురాలై ఆ పేదరాలి ఇంట్లో బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. అందుకే దీనికి “కనకధారా స్తోత్రం” అని పేరు వచ్చింది.


    శ్రీ కనకధారా స్తోత్రం – ప్రతి పదార్థం మరియు తాత్పర్యం

    శ్లోకం

    వందే వందారు మందారమిందిరానందకందలమ్ ।
    అమందానందసందోహ బంధురం సింధురాననమ్ ॥

    తాత్పర్యం: నమస్కరించే వారికి కోరిన కోర్కెలు తీర్చే మందార వృక్షం వంటిది, ఇందిరా దేవి (లక్ష్మి) కి ఆనందాన్ని ఇచ్చేది, సముద్ర రాజ తనయ అయిన ఆ మహాలక్ష్మికి నేను నమస్కరిస్తున్నాను.

    శ్లోకం

    అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ
    భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ ।
    అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా
    మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ॥ 1 ॥

    తాత్పర్యం: తమాల వృక్షం చుట్టూ తిరిగే ఆడు తుమ్మెద లాగా, శ్రీహరి శరీరంపై పులకలను కలిగిస్తూ నిరంతరం ఆయనను ఆశ్రయించి ఉండేది, సకల ఐశ్వర్యాలకు మూలమైన మహాలక్ష్మి యొక్క కటాక్షం నాకు మంగళాన్ని కలిగించుగాక.

    శ్లోకం

    ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
    ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని ।
    మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా
    సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః ॥ 2 ॥

    తాత్పర్యం: నల్ల కలువ పువ్వు చుట్టూ తిరిగే తుమ్మెద లాగా, మురారి (విష్ణువు) ముఖంపై సిగ్గుతో కూడిన చూపులను ప్రసరింపజేసే సముద్ర తనయ చూపులు నాకు సంపదలను ప్రసాదించుగాక.

    శ్లోకం

    ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం-
    ఆనందకందమనిమేషమనంగతంత్రమ్ ।
    ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం
    భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః ॥ 3 ॥

    తాత్పర్యం: శ్రీహరి కంఠంలో ముత్యాల హారంలా ప్రకాశిస్తూ, ఆయన చూపులలో పరవశించే మహాలక్ష్మి యొక్క దివ్య దృష్టి నా కష్టాలను తొలగించి సంతృప్తిని కలిగించుగాక.

    శ్లోకం

    బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా
    హారావళీవ హరినీలమయీ విభాతి ।
    కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా
    కల్యాణమావహతు మే కమలాలయాయాః ॥ 4 ॥

    తాత్పర్యం: కౌస్తుభ మణి ప్రకాశిస్తున్న శ్రీమహావిష్ణువు యొక్క విశాలమైన రొమ్ముపై, మహాలక్ష్మి దేవి చూపులు ఇంద్రనీలమణులతో కూర్చిన హారం లాగా నీలిరంగులో తళతళలాడుతూ ప్రకాశిస్తున్నాయి. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికే పరమానందాన్ని, ప్రేమను కలిగించే సామర్థ్యం ఉన్న ఆ మహాలక్ష్మి కటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించి, నాకు సకల శుభాలను (కల్యాణమును) కలిగించుగా

    శ్లోకం

    కాలాంబుదాళిలలితోరసి కైటభారేః
    ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ ।
    మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
    భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ॥ 5 ॥

    తాత్పర్యం: కారుమబ్బు వంటి విష్ణుమూర్తి వక్షస్థలంపై మెరుపుతీగలా ప్రకాశించే లోకమాత, భృగు మహర్షి పుత్రిక అయిన మహాలక్ష్మి నాకు శుభాలను ప్రసాదించుగాక.

    శ్లోకం

    ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
    మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన ।
    మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం
    మందాలసం చ మకరాలయకన్యకాయాః ॥ 6 ॥

    తాత్పర్యం: మన్మథుడు ఏ చూపుల ప్రభావం చేత విష్ణువు హృదయంలో స్థానం సంపాదించాడో, సముద్ర పుత్రిక అయిన లక్ష్మీదేవి యొక్క అటువంటి కరుణా దృష్టి నాపై పడుగాక.

    శ్లోకం

    విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం
    ఆనందహేతురధికం మురవిద్విషోఽపి ।
    ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం
    ఇందీవరోదరసహోదరమిందిరాయాః ॥ 7 ॥

    తాత్పర్యం: దేవేంద్ర పదవిని కూడా ఇచ్చే సామర్థ్యం కలిగినవి, శ్రీమహావిష్ణువుకు అత్యంత ఆనందాన్ని ఇచ్చేవి అయిన లక్ష్మీదేవి కటాక్ష వీక్షణాలు ఒక్క క్షణ కాలమైనా నాపై ప్రసరించుగాక.

    శ్లోకం

    ఇష్టా విశిష్టమతయోఽపి యయా దయార్ద్ర
    దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే ।
    దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం
    పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః ॥ 8 ॥

    తాత్పర్యం: ఏ దేవి కటాక్షం వల్ల సామాన్యులు కూడా స్వర్గ పదవిని పొందుతారో, పద్మంపై ఆసీనురాలై ఉండే ఆ తల్లి చూపులు నాకు పుష్టిని, సంపదను కలిగించుగాక.

    శ్లోకం

    దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా-
    మస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే ।
    దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
    నారాయణప్రణయినీనయనాంబువాహః ॥ 9 ॥

    తాత్పర్యం: పేదవాడైన ఈ చాతక పక్షిపై (భక్తుడిపై) నారాయణ ప్రియురాలైన లక్ష్మీ దేవి తన కరుణ అనే గాలితో ధన వర్షాన్ని కురిపించి, నా పాపాలనే వేడిని దూరం చేయుగాక

    శ్లోకం

    గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి
    శాకంభరీతి శశిశేఖరవల్లభేతి ।
    సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై
    తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై ॥ 10 ॥

    తాత్పర్యం: సరస్వతిగా, లక్ష్మిగా, శాకంభరిగా, పార్వతిగా సృష్టి స్థితి లయలను నిర్వహించే ముల్లోకాల గురువైన విష్ణుమూర్తి భార్యకు నా నమస్కారాలు.

    శ్లోకం

    శ్రుత్యై నమోఽస్తు శుభకర్మఫలప్రసూత్యై
    రత్యై నమోఽస్తు రమణీయగుణార్ణవాయై ।
    శక్త్యై నమోఽస్తు శతపత్రనికేతనాయై
    పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమవల్లభాయై ॥ 11 ॥

    తాత్పర్యం: శుభ ఫలితాలనిచ్చే శ్రుతి (వేదం) రూపానికి, గుణ సాగరమైన రతీ దేవి రూపానికి, పద్మంలో ఉండే శక్తి రూపానికి, పురుషోత్తముని ప్రియురాలైన పుష్టి రూపానికి నమస్కారాలు

    శ్లోకం

    నమోఽస్తు నాళీకనిభాననాయై
    నమోఽస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై ।
    నమోఽస్తు సోమామృతసోదరాయై
    నమోఽస్తు నారాయణవల్లభాయై ॥ 12 ॥

    తాత్పర్యం: పద్మం వంటి ముఖం కలదానికి, పాల సముద్రంలో పుట్టినదానికి, చంద్రునికి అమృతానికి సోదరి అయినదానికి, నారాయణ ప్రియురాలికి నమస్కారా

    శ్లోకం

    నమోఽస్తు హేమాంబుజపీఠికాయై
    నమోఽస్తు భూమండలనాయికాయై ।
    నమోఽస్తు దేవాదిదయాపరాయై
    నమోఽస్తు శారంగాయుధవల్లభాయై ॥ 13 ॥

    తాత్పర్యం: బంగారు పద్మం పీఠంగా కలదానికి, భూమండలానికి నాయకురాలికి, దేవతలపై దయ చూపే దానికి, విష్ణుమూర్తి భార్యకు నమస్కారాలు.

    శ్లోకం

    నమోఽస్తు దేవ్యై భృగునందనాయై
    నమోఽస్తు విష్ణోరురసిస్థితాయై ।
    నమోఽస్తు లక్ష్మ్యై కమలాలయాయై
    నమోఽస్తు దామోదరవల్లభాయై ॥ 14 ॥

    తాత్పర్యం: భృగు మహర్షి పుత్రికకు, విష్ణువు వక్షస్థలంలో నివసించే దానికి, పద్మంలో ఉండే లక్ష్మీదేవికి, దామోదరుని ప్రియురాలికి నమస్కారాలు

    శ్లోకం

    నమోఽస్తు కాంత్యై కమలేక్షణాయై
    నమోఽస్తు భూత్యై భువనప్రసూత్యై ।
    నమోఽస్తు దేవాదిభిరర్చితాయై
    నమోఽస్తు నందాత్మజవల్లభాయై ॥ 15 ॥

    తాత్పర్యం: కాంతి స్వరూపిణికి, పద్మనేత్రికి, ఐశ్వర్య ప్రదాయినికి, లోకమాతకు, దేవతలచే పూజింపబడే నందనందనుని ప్రియురాలికి నమస్కారాలు.

    శ్లోకం

    సంపత్కరాణి సకలేంద్రియనందనాని
    సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి ।
    త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని
    మామేవ మాతరనిశం కలయంతు మాన్యే ॥ 16 ॥

    తాత్పర్యం: సంపదలను ఇచ్చేవి, ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చేవి, సామ్రాజ్యాన్ని ప్రసాదించేవి, పాపాలను హరించేవి అయిన నీకు చేసే నమస్కారాలు నాపై ఎప్పుడూ ఉండుగాక.

    శ్లోకం

    యత్కటాక్షసముపాసనావిధిః
    సేవకస్య సకలార్థసంపదః ।
    సంతనోతి వచనాంగమానసైః
    త్వాం మురారిహృదయేశ్వరీం భజే ॥ 17 ॥

    తాత్పర్యం: ఎవరి కటాక్షం కోసం చేసే ఉపాసన భక్తుడికి సకల సంపదలను ఇస్తుందో, అటువంటి మురారి హృదయేశ్వరిని మనసా వాచా కర్మణా భజిస్తున్నాను.

    శ్లోకం

    సరసిజనిలయే సరోజహస్తే [సరసిజనయనె]
    ధవళతమాంశుకగంధమాల్యశోభే ।
    భగవతి హరివల్లభే మనోజ్ఞే
    త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ ॥ 18 ॥

    తాత్పర్యం: పద్మంలో నివసించేదానివి, చేతిలో పద్మం ధరించినదానివి, తెల్లని వస్త్రాలు గంధం మాలలతో శోభిల్లేదానివి, ముల్లోకాలకు ఐశ్వర్యాన్ని ఇచ్చేదానివి అయిన ఓ హరివల్లభా! నాపై ప్రసన్నురాలవు కమ్ము.

    శ్లోకం

    దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట
    స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీమ్ ।
    ప్రాతర్నమామి జగతాం జననీమశేష
    లోకాధినాథ-గృహిణీం-అమృతాబ్ధిపుత్రీమ్ ॥ 19 ॥

    తాత్పర్యం: దిగ్గజాలు బంగారు కలశాలతో గంగా జలాన్ని చిమ్ముతుండగా అభిషేకం పొందే లోకమాతకు, విష్ణుమూర్తి భార్యకు, అమృత సముద్ర పుత్రికకు ఉదయాన్నే నమస్కరిస్తున్నాను.

    శ్లోకం

    కమలే కమలాక్షవల్లభే త్వం
    కరుణాపూరతరంగితైరపాంగైః ।
    అవలోకయ మామకించనానాం
    ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః ॥ 20 ॥

    తాత్పర్యం: ఓ కమలా! విష్ణుప్రియా! పేదవాడైన నన్ను నీ కరుణా వీక్షణాలతో చూడు. నీ దయకు నేను మొదటి పాత్రుడిని అయ్యేలా అనుగ్రహించు.

    శ్లోకం

    స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం
    త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ ।
    గుణాధికా గురుతర-భాగ్య-భాగినో [భాగినహ్]
    భవంతి తే భువి బుధభావితాశయాః ॥ 21 ॥

    తాత్పర్యం: వేద స్వరూపిణి, ముల్లోకాలకు తల్లి అయిన ఆ మహాలక్ష్మిని, ఎవరైతే ఈ కనకధారా స్తోత్రంతో ప్రతిరోజూ భక్తితో స్తుతిస్తారో.. వారు ఈ భూమిపై గొప్ప గుణవంతులుగా మారుతారు. అంతేకాకుండా, వారు అత్యంత గొప్పదైన అదృష్టాన్ని, సంపదలను పొందుతారు. అటువంటి భక్తులను లోకంలోని విద్వాంసులు, జ్ఞానులు సైతం గౌరవిస్తారు.

    శ్లోకం

    సువర్ణధారాస్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితమ్ ।
    త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్ ॥

    తాత్పర్యం: ఆదిశంకరాచార్యుల వారిచే రచింపబడిన ఈ పవిత్రమైన “సువర్ణధారా (కనకధారా) స్తోత్రాన్ని” ఎవరైతే ప్రతిరోజూ మూడు సంధ్యల వేళలలో భక్తితో పఠిస్తారో, వారు ఈ భూమిపై కుబేరుడితో సమానమైన ఐశ్వర్యాన్ని, సంపదలను పొందుతారు.

    ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ కనకధారాస్తోత్రం సంపూర్ణమ్ ।

    “శ్రీ గోవింద భగవత్ పూజ్యపాదుల వారి శిష్యులైనట్టియు, పరమహంస పరివ్రాజకాచార్యులైనట్టియు శ్రీ శంకర భగవత్పాదుల (ఆదిశంకరాచార్యుల) వారిచే రచింపబడిన ఈ ‘కనకధారా స్తోత్రము’ ఇంతటితో సంపూర్ణము.”

    Also Read: Sri Durga Saptashloki


    Benefits of Chanting Kanakadhara Stotram

    ఈ స్తోత్ర పఠనం వల్ల కలిగే ఆధ్యాత్మిక మరియు భౌతిక ఫలితాలు అపారం:

    • Wealth (సంపద): ఆర్థిక ఇబ్బందులు తొలగి, ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. స్థిరమైన సంపద లభిస్తుంది.
    • Mental Peace (మానసిక ప్రశాంతత): ఆందోళనలు తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది.
    • Health (ఆరోగ్యం): దేవి అనుగ్రహంతో శారీరక రుగ్మతలు తొలగి ఆరోగ్యం చేకూరుతుంది.
    • Protection (రక్షణ): దుష్ట శక్తుల నుండి, ప్రతికూల ఆలోచనల నుండి రక్షణ లభిస్తుంది.
    • Prosperity (అభ్యుదయం): చేసే పనులలో విజయం, సమాజంలో గౌరవం లభిస్తాయి.

    పారాయణ విధానం (How to Chant)

    • ఉత్తమ సమయం: ప్రతిరోజూ ఉదయం (బ్రాహ్మ ముహూర్తం) లేదా సాయంత్రం ప్రదీప సమయంలో చదవడం శ్రేష్ఠం. శుక్రవారం నాడు పఠించడం విశేష ఫలితాలనిస్తుంది.
    • సంఖ్య: కనీసం ఒకసారి లేదా 3, 11 సార్లు చదవవచ్చు.
    • దిశ: తూర్పు లేదా ఉత్తర ముఖంగా కూర్చుని పఠించాలి.
    • శుభ్రత: స్నానం ఆచరించి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, దీపారాధన చేసి పఠించాలి.
    • సంకల్పం: “అమ్మా మహాలక్ష్మీ! నా దారిద్ర్యాన్ని తొలగించి, నీ కరుణా కటాక్షాలను నాపై ప్రసరింపజేయి” అని మనసులో బలంగా అనుకోవాలి.

    నియమాలు (Do’s and Don’ts)

    • చేయవలసినవి: పూర్తి ఏకాగ్రతతో, భక్తితో పఠించాలి. దేవి పటం ముందు నెయ్యి దీపం వెలిగిస్తే మంచిది.
    • చేయకూడనివి: అపనమ్మకంతో లేదా ఏదో మొక్కుబడిగా చదవకూడదు. పారాయణ సమయంలో మాంసాహారం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి.

    ఎవరు చదవవచ్చు?

    • విద్యార్థులు: ఏకాగ్రత, జ్ఞానం పెరగడానికి.
    • గర్భిణీ స్త్రీలు: పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా, దైవచింతనతో ఉండడానికి.
    • కష్టాల్లో ఉన్నవారు: ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు లేదా భయంతో బాధపడేవారు తప్పక పఠించాలి.

    ముగింపు

    కనకధారా స్తోత్రం కేవలం ధనం కోసమే కాదు, మానసిక వికాసం కోసం కూడా ఒక అద్భుత సాధన. ఆదిశంకరులు మనకిచ్చిన ఈ గొప్ప వరప్రసాదాన్ని భక్తితో స్మరిద్దాం. ఆ తల్లి మహాలక్ష్మి మనందరి ఇళ్లను సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో నింపాలని కోరుకుందాం.

    లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీ మహాలక్ష్మ్యై నమః.

    Also Read: Mahishasura Mardini Stotram

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    శ్రీ అంగారక స్తోత్రం – (Runa Vimochana Angaraka Stotram In Telugu)

    నవగ్రహాలలో అంగారకుడు (కుజుడు) ధైర్యానికి, పరాక్రమానికి మరియు శక్తికి కారకుడు. జాతకంలో...

    శ్రీ కేతు స్తోత్రం -(Sri Ketu Stotram In Telugu)

    నవగ్రహాలలో కేతువును 'మోక్ష కారకుడు' అని పిలుస్తారు. రాహువు భౌతిక సుఖాల...

    శ్రీ శని స్తోత్రం – (Sri Shani Stotram In Telugu)

    నవగ్రహాలలో శనీశ్వరుడు కర్మఫల ప్రదాత. మనం చేసిన పనులకు తగిన ఫలితాలను...

    శ్రీ రాహు స్తోత్రం – (Sri Rahu Stotram  In Telugu)

    నవగ్రహాలలో రాహువు అత్యంత ప్రభావవంతమైన ఛాయా గ్రహం. జాతక చక్రంలో రాహువు...