టెక్ దిగ్గజం యాపిల్ తన అత్యంత ప్రతిష్టాత్మక iPhone 17 సిరీస్‌ను సెప్టెంబర్ 9 (మంగళవారం) జరగబోయే “Awe Dropping” ఈవెంట్లో ఆవిష్కరించనుంది. ఈసారి నాలుగు మోడల్స్ – iPhone 17 Pro Max, iPhone 17 Pro, iPhone 17 Air, iPhone 17 (base model) విడుదలయ్యే అవకాశముంది. అదనంగా కొత్త Apple Watch, AirPods, యాక్సెసరీస్ కూడా ఆవిష్కరించవచ్చని సమాచారం.
డిజైన్
-
ఐదు సంవత్సరాల తర్వాత యాపిల్ ఐఫోన్ డిజైన్‌ను కొత్తగా మార్చబోతోందని లీకులు చెబుతున్నాయి.
-
ప్రత్యేకంగా iPhone 17 Air మోడల్, MacBook Air మరియు iPad Air లా సన్నగా, స్టైలిష్‌గా ఉండనుంది.
-
కేవలం 5.5 mm మందంతో, ఇది ఇప్పటివరకు వచ్చిన అతి సన్నని ఐఫోన్‌గా నిలుస్తుందని, బ్లూమ్‌బర్గ్ సమాచారం.
-
ఇందులో A19 ప్రాసెసర్, USB-C పోర్ట్, ProMotion సపోర్ట్, 6.6-అంగుళాల డిస్‌ప్లే ఉంటుందని అంచనా.
కెమెరా
-
iPhone 17 Proలో అధునాతన కెమెరా అప్‌గ్రేడ్లు, మెరుగైన low-light performance, ఎన్‌హాన్స్డ్ జూమ్ ఫీచర్లు వచ్చే అవకాశం.
రంగులు
-
ఈ సిరీస్‌లో కొత్తగా గ్రీన్ మరియు పర్పుల్ రంగులు అందుబాటులోకి రావచ్చు.
-
గతేడాది వచ్చిన iPhone 16 ఐదు రంగుల్లో (బ్లాక్, వైట్, పింక్, టీల్, అల్ట్రామెరైన్ బ్లూ) లాంచ్ అయింది.
బ్యాటరీ
-
లీకుల ప్రకారం, iPhone 17 Pro Maxలో సుమారు 5,000 mAh సామర్థ్యమున్న బ్యాటరీ ఉండవచ్చు. ఇది iPhone 16 Pro Max (4,676 mAh) కన్నా ఎక్కువ.
-
కొత్త OLED ప్యానెల్స్తో ఎక్కువ brightness వస్తూనే, బ్యాటరీపై ఒత్తిడి తగ్గనుందని చెబుతున్నారు.
-
ముఖ్యంగా 4K వీడియో @ 60fps రికార్డింగ్ చేసే క్రియేటర్లకు ఇది ఉపయోగపడుతుంది.
ధర
-
భారత మార్కెట్‌లో iPhone 17 సిరీస్ ధరలు ఈ విధంగా ఉండొచ్చని అంచనా:
-
iPhone 17 (base model): ₹89,900
-
iPhone 17 Air: ₹95,000
-
iPhone 17 Pro Max: ₹1,64,900 వరకు
-
-
అమెరికా మార్కెట్లో base iPhone 17 ధర $799 వద్దే ఉండనుంది. కొత్తగా వస్తున్న iPhone 17 Air ధర $899 – $949 మధ్య ఉండవచ్చని JPMorgan నివేదిక చెబుతోంది.

